డికాక్‌ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. | England Vs South Africa 3rd ODI Washed Out Due Rain ODI Series Drawn | Sakshi
Sakshi News home page

ENG Vs SA: డికాక్‌ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు..

Published Sun, Jul 24 2022 10:18 PM | Last Updated on Sun, Jul 24 2022 10:20 PM

England Vs South Africa 3rd ODI Washed Out Due Rain ODI Series Drawn - Sakshi

ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. డికాక్‌ (76 బంతుల్లో 92 పరుగులు నాటౌట్‌, 13 ఫోర్లు) దూకుడుగా ఆడగా.. మార్క్రమ్‌ 24 పరుగులతో ఆడుతున్నారు.  ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ తర్వాత పలుమార్లు అంపైర్లు పరిశీలించారు. మ్యాచ్‌ 20 ఓవర్లకు కుదించి ఆడిద్దామనుకున్నా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 

అయితే మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ సెంచరీ దిశగా పయనించాడు. కేవలం 8 పరుగుల దూరంలో ఉండగా డికాక్‌ సెంచరీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు చెరొక మ్యాచ్‌ గెలవడంతో సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా వాండర్‌ డుసెన్‌ ఎంపికయ్యాడు. 

చదవండి: Nathan Lyon Wedding: లేటు వయసులో ఘాటైన ప్రేమ.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్‌ స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement