వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 170 పరుగులకు కుప్పకూలింది. ఆఖరిలో రీస్ టాప్లే బ్యాటింగ్‌కు రాకపోవడంతో 170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
కాగా భారీ లక్ష్య ఛేదనలో మొదటి నుంచే సఫారీ పేసర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్‌ను తిరిగి కోలుకోకుండా చేశారు. ఇంగ్లండ్ టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడీ తలా రెండు వికెట్ల, సాధించారు. రబాడ, కేశవ్ మహారాజ్‌కు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మార్క్ వుడ్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
క్లాసెన్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశారు. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ రీజా హెండ్రిక్స్(85), మార్కో జాన్సెన్(75) రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60), పరుగులతో అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, గుస్ అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించారు. సెంచరీతో చెలరేగిన క్లాసెన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: WC 2023 NZ vs ENG: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు మరో భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment