
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది. ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ను అందుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్.. బెయిర్ స్టోను పెవిలియన్‌కు చేర్చాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో ఇంగ్లండ్ పరుగు మాత్రమే చేసి తొలి వికెట్‌ను నష్టపోయింది. ఇంగ్లండ్ జట్టుకు కీలక ఆటగాడైన బెయిర్ స్టో డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు శిబిరంలో నిరాశ నెలకొంది.
(ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం)
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేసన్ రాయ్, బెయిర్ స్టోలు ఆరంభించారు. అదే సమయంలో సఫారీ స్టార్ స్పిన్నర్ తాహీర్‌కు తొలి ఓవర్‌ను అప్పచెప్పాడు డుప్లెసిస్. తనపై పెట్టుకున్న కెప్టెన్ అంచనాలను నిజం చేస్తూ తాహీర్ ఆదిలోనే కీలక వికెట్‌ను తీసి దక్షిణాఫ్రికాకు శుభారంభం అందించాడు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్
Comments
Please login to add a commentAdd a comment