దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్‌కు ఓ నెటిజన్ కోపం తెప్పించాడు. దీంతో ఆ నెటిజన్‌ను స్టెయిన్ కడిగిపారేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములు, వివాదాలతో సతమవుతున్న ప్రొటీస్ జట్టుకు ఈ విజయం ఎంతో ఊరట కలిగించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో, జట్టులో కొన్ని సంస్కరణల అనంతరం స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో విజయం సాధించడం పట్ల ఆదేశ తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డుప్లెసిస్ సేనపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ స్టెయిన్ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్టెయిన్ ఆగ్రహానికి గురయ్యాడు. గెలిచింది స్వదేశంలో కదా లెక్కలోకి రాదు అంటూనే దేవుడి దయతో మ్యాచ్ గెలిచారనే అనే అర్థంలో రీట్వీట్ చేశాడు. దీంతో స్టెయిన్‌కు చిర్కెత్తుకొచ్చింది. ఆ నెటిజన్ భారత్‌కు చెందిన వాడని గుర్తించిన ఈ ప్రొటీస్ బౌలర్ అతడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘అయితే టీమిండియా కూడా భారత్‌లో గెలిచినవి లెక్కలోకి రావా? అయినా మా గెలుపుకు దేవుడితో సంబంధం ఏంటి? ఇడియట్’అంటూ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు స్టెయిన్‌కు అండగా నిలుస్తుండగా.. మరికొందరు ఇడియట్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment