కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు
ముంబై: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు రోహిత్ శర్మ కెపె్టన్ కాగా...పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. సాధారణంగా భారత్‌లో జరిగే సిరీస్‌లకు వైస్ కెపె్టన్ ను ప్రకటించే సాంప్రదాయం లేదు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌కు కూడా వైస్ కెప్టెన్ ఎవరూ లేరు. అయితే ఈ సిరీస్ తర్వాత జరిగే ఆ్రస్టేలియా పర్యటనలో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాస్త ముందుగా సన్నద్ధత కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కివీస్‌తో పోరుకు బుమ్రాను ఎంపిక చేసింది.
గతంలో ఒకే ఒక టెస్టులో భారత్‌కు సారథిగా వ్యవహరించిన బుమ్రా...శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో వైస్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాతో సిరీస్‌లో ఉన్న 16 మంది సభ్యుల జట్టునుంచి ఒకే ఒక మార్పుతో కివీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించారు. పేసర్ యశ్ దయాళ్‌ను జట్టునుంచి తప్పించారు. ఇది మినహా మిగతా 15 మందిలో ఎలాంటి మార్పూ లేదు.
సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజా జట్టు ప్రకటనతో అర్థమైంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 16 నుంచి బెంగళూరులో తొలి టెస్టు జరుగుతుంది.
జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్, సర్ఫరాజ్, పంత్, జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్.
ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు: నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment