భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ అయితే మ్యాచ్‌కు ఒక రోజే ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్ జట్టు కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు తుది జట్టులో ఇంగ్లండ్ మేనెజ్‌మెంట్ ఛాన్స్ ఇచ్చింది.
ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్‌బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్‌బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది.
ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్‌గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment