జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానునున్న భారత్ - ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు కూడా విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని ఊవ్విళ్లరూతున్నాయి.
సొంతగడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య భారత్ వేదికగా 16 సిరీస్‌లు జరగగా.. టీమిండియా 10 సిరీస్‌లలో విజయం సాధించగా, ఇంగ్లండ్ ఐదింట గెలుపొందింది. భారత గడ్డపై ఇంగ్లండ్ చివరగా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఇంగ్లండ్ టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్ ఆడి ప్రత్యర్ది జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
టెస్టు క్రికెట్‌ను టీ20 మాదిరిగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు నుంచి రోహిత్ సేనకు గట్టిపోటీ ఎదురుకానుంది. తాజాగా ఇంగ్లండ్ బాజ్‌బాల్‌పై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బాజ్‌బాల్‌ను ఎదుర్కొనేందుకు తను సిద్దంగా ఉన్నాని బుమ్రా తెలిపాడు.
"ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను నేను పరిగణలోకి తీసుకోవడం లేదు. వారిని అడ్డుకోవడానికి ఎటువంటి వ్యూహాలు రచించడం లేదు. కానీ ఇంగ్లండ్ మాత్రం ఇటీవల కాలంలో అద్బుతమైన క్రికెట్ ఆడుతున్నారు. టెస్టు ఫార్మాట్‌లో దూకుడుగా ఆడి ప్రత్యర్ది జట్లపై పైచేయి సాధించారు. టెస్టు క్రికెట్‌ను ఈ విధంగా కూడా ఆడవచ్చని ప్రపంచానికి ఇంగ్లీష్ జట్టు చూపించింది.
అయితే ఒక బౌలర్‌గా ఇంగ్లండ్‌పై పై చేయి సాధిస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు దూకుడుగా ఆడి నన్ను అలసటకు గురి చేయలేరు. అందువల్ల నాకు ఎక్కువగా వికెట్లు తీసే ఛాన్స్ ఉంటుంది. మైదానంలోకి దిగిన ప్రతిసారి పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అనేదాని గురించి ఎక్కువ ఆలోచిస్తానని" ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా పేర్కొన్నాడు.
చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్‌వెల్..
Comments
Please login to add a commentAdd a comment