England vs Australia, 1st Test- Joe Root: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతోంది. మూడో రోజైన ఆదివారం నాటి ఆట వర్షం కారణంగా కేవలం 32.4 ఓవర్ల పాటే సాగింది. వరుణుడి ఆటంకంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు నష్టపోయి 28 పరుగులు చేయగలిగింది.
ఇదిలా ఉంటే.. సోమవారం నాలుగో రోజు ఆట మొదలు కాగా ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ మొదటి బంతికే దూకుడు ప్రదర్శించాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన బంతిని రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు.
పంత్ రియల్ ఐడీ నుంచి రావొచ్చు కదా!
బజ్‌బాల్ విధానంతో టెస్టుల్లో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ పేరును నిలబెడుతూ నమ్మశక్యం కాని రీతిలో ఫస్ట్ బాల్‌కే రూట్ ఇలాంటి షాట్ ఆడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పేరును ప్రస్తావిస్తున్నారు.
‘‘నాలుగో రోజు మొదటి బాల్.. కమిన్స్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్ ప్రయత్నించిన రూట్’’ అంటూ జాన్స్ అనే యూజర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘నిజమైన ఐడీ నుంచి రావొచ్చు కదా పంత్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా యాషెస్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచిన జో రూట్ పలు రికార్డులు సృష్టించాడు.
అజేయ సెంచరీతో.. ఇప్పుడిలా
రెండో ఇన్నింగ్స్‌లో 55 బంతదుల్లో 46 పరుగులు చేసిన అతడు.. నాథన్ లియోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కాగా రిషభ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్లు ఆడటంలో దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదం బారిన పడిన కారణంగా పంత్ పలు కీలక సిరీస్‌లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్న అతడు వన్డే వరల్డ్‌కప్ నాటికైనా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
పోటాపోటీగా
ఇదిలా ఉంటే.. నాలుగోరోజు ఆటలో 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(0), బెన్ స్టోక్స్(13) క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దీటుగానే బదులుచ్చిన ఆసీస్ 386 పరుగులకు తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.
చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
రూ. లక్ష ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్ కదా! 5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసి మరీ..
A ramp-bunctious start from Joe Root 🔥
— England Cricket (@englandcricket) June 19, 2023
What is going on!? 😂🤷♂️ #EnglandCricket | #Ashes pic.twitter.com/ieMdbBnRAH
Comments
Please login to add a commentAdd a comment