రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఓ వైపు అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతుంటే.. సిరాజ్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్ మియా ఏకంగా 43 పరుగులిచ్చాడు.
ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే సిరాజ్‌కు చుక్కలు చూపించాడు. 7 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో క్రాలే వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటి సిరాజ్ భయ్యా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.
ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లండ్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు.
Crawley just Shaming Siraj like in T20 Mode..
— Muhammad Asim (@MrAsim_31) February 23, 2024
Bazball Mode is on...
4️⃣4️⃣4️⃣6️⃣ To siraj...#BobbiAlthoff #bobbiAlthoffleak #INDvENG pic.twitter.com/wEtPPgpg3a
Comments
Please login to add a commentAdd a comment