రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ఆకాష్ దీప్‌ను దురదృష్టం వెంటాడింది. తృటిలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.
ఏం జరిగిందంటే?
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆకాష్ ఐదో బంతిని క్రాలేకు అద్బుతమైన ఇన్ స్వింగర్‌గా సంధించాడు. ఆకాష్ వేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునే లేపే ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. వెంటనే బౌలర్ ఆకాష్ సంబరాల్లో మునిగి తేలిపోయాడు.
కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్ ఫ్రంట్ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
What a no ball Akash deep 😫 pic.twitter.com/rObjmSFkJn
— Rishi (@EpicVirat) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment