ధోనిని గుర్తుచేసిన రోహిత్‌.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్‌ | Rohit Sharma Turns MSD, DRS Combine As Zak Crawley Walks Back On 73 | Sakshi
Sakshi News home page

IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్‌.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్‌

Published Mon, Feb 5 2024 12:33 PM | Last Updated on Mon, Feb 5 2024 5:11 PM

Rohit Sharma Turns MSD,  DRS Combine As Zak Crawley Walks Back On 73 - Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. భారత విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇంగ్లీష్‌ జట్టు విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. 

అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ హిత్ శర్మ.. ఫీల్డింగ్ మార్పులతో పాటు బౌలింగ్ మార్పులు, డీఆర్‌ఎస్ తీసుకోవడంలోనూ అభిమానులు అకట్టుకుంటున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా రోహిత్‌ తీసుకున్న డీఆర్‌ఎస్‌.. మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పేలా చేసింది.

ఏం జరిగిందంటే?
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ(73) దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 42వ వేసిన కుల్దీప్‌ యాదద్‌ బౌలింగ్‌లో ఆరో బంతిని క్రాలే.. డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ప్యాడ్‌కు తాకింది. వెంటనే వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌తో పాటు బౌలర్‌ ఎల్బీకి అప్పీలు చేశాడు. కానీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రివ్యూ తీసుకోవడానికి శ్రీకర్‌ భరత్‌ సలహా ఆడిగాడు. భరత్‌ మాత్రం లెగ్‌సైడ్‌ వెళ్తున్నట్లు అన్పిస్తోందనట్లు రోహిత్‌కు సూచించాడు. కానీ రోహిత్‌ మాత్రం తెలివగా ఆలోచించి ఆఖరి మూడు నిమిషాల్లో డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు.

అయితే రిప్లేలో బంతి వికెట్లను హిట్టింగ్‌ చేస్తున్నట్లు తేలింది. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఔట్‌గా ప్రకటించింది. ఇక బిగ్‌ స్క్రీన్‌లో వికెట్లను బంతి హిట్‌ చేస్తున్నట్లు కన్పించడంతో భారత ఆటగాళ్లలో సంబరాల్లో మునిగి తేలిపోయారు.

ముఖ్యంగా రోహిత్‌ శర్మ అయితే  గాల్లోకి  జంప్‌ చేస్తూ మరి సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎంఎస్‌ ధోని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement