Ind vs Eng 3rd Test Day 3 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు ఆట ఆరంభమైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది ఇంగ్లండ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది.
మూడో రోజు ముగిసిన ఆట..
మూడో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు.
అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది.
జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్..
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. వెన్ను నొప్పి కారణంగా జైశ్వాల్ మూడో రోజు ఆట ఆఖరి సెషన్‌లో మైదానాన్ని వీడాడు. జైశ్వాల్(104) పరుగులు చేశాడు. 47 ఓవర్లకు భారత్ స్కోర్: 190/1. టీమిండియా ప్రస్తుతం 321 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..
జైశ్వాల్‌తో పాటు క్రీజులో ఉన్న మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్: 184/1. భారత్ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
జైశ్వాల్ సూపర్ సెంచరీ..
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. జైశ్వాల్ ప్రస్తుతం 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు గిల్(45) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్: 171/1. భారత్ ప్రస్తుతం 297 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్..
సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 80 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యశస్వీ తనదైన స్టైల్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 116/1, క్రీజులో జైశ్వాల్(65)తో పాటు శుబ్‌మన్ గిల్(26) ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న గిల్, జైశ్వాల్..
టీమిండియా యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(8), యశస్వీ జైశ్వాల్(23) నిలకడగా ఆడుతున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/1
టీ విరామానికి భారత్ స్కోర్: 44/1
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(19), శుబ్‌మన్ గిల్(5) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 170 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
11.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా రోహిత్ శర్మ(19) వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గిల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్ 10 పరుగులతో ఆడుతున్నాడు.
బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత రెండో ఇన్నింగ్స్ ఆరంభించారు. స్కోరు: 13/0 (4)
ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది.
►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 445
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 319
పదో వికెట్ డౌన్
71.1: సిరాజ్ బౌలింగ్ ఆండర్సన్ బౌల్డ్. పదో వికెట్‌గా ఆండర్సన్ వెనుదిరగడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.
మరో షాక్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
70.2: జడేజా బౌలింగ్‌లో టామ్ హార్లే(9)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 314/9 (70.2)
ఎనిమిదో వికెట్ డౌన్
69.5: సిరాజ్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. హార్లే తొమ్మిది పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 314-8(70)
వరుస షాకులు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
స్టోక్స్ అవుటైన మరుసటి బంతికే బెన్ ఫోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ , టామ్ హార్లే క్రీజులో ఉన్నారు. స్కోరు: 299/7 (65.3).టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉంది.
భోజన విరామం తర్వాత వికెట్
బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఇంగ్లండ్ 61వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టోక్స్ 39, ఫోక్స్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద నిలిచింది.
56వ ఓవర్ ముగిసే సరికి ఇలా
ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, ఫోక్స్. ఇంగ్లండ్ స్కోరు: 275/5 (56). స్టోక్స్ 28, ఫోక్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
50.1: ఎట్టకేలకు సెంచరీ వీరుడు బెన్ డకెట్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసిన డకెట్.. శతకాన్ని ద్విశతకంగా మార్చాలని భావించగా.. కుల్దీప్ అతడి జోరుకు బ్రేక్ వేశాడు.
బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్టోక్స్ 20 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 260-5(51)
నిలకడగా ఆడుతున్న డకెట్, స్టోక్స్
48 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 247/4 . డకెట్ 153, స్టోక్స్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 198 పరుగులు వెనుబడి ఉంది.
నాలుగో వికెట్ డౌన్
ఆట మొదలెట్టిన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. బుమ్రా రూట్‌ను అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. డకెట్ 142 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 225-4(41)
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో జో రూట్(18) జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. బెన్ డకెట్ 141 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 224-3.
అశ్విన్ లేకుండానే
ఇక కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ శనివారం బరిలో దిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్(ఆటగాడి తలకు దెబ్బతగిలినపుడు), కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్ మధ్యలో వైదొలిగిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి.
అది కూడా సదరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, అశ్విన్ తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా వైదొలిగినందున అతడి స్థానంలో వేరే ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా మూడో రోజు ఆటలో టీమిండియా పది మంది యాక్టివ్ ప్లేయర్లతో మైదానంలో దిగింది.
రెండో రోజు హైలైట్స్
►ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ
►తొలి ఇన్నింగ్స్‌లో 207/2
►భారత్ 445 ఆలౌట్
►అశ్విన్‌కు 500వ వికెట్
తుదిజట్లు:
భారత్
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
Comments
Please login to add a commentAdd a comment