ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది.
2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. డకెట్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్‌కు దక్కింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చివరి మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్
Comments
Please login to add a commentAdd a comment