బెన్‌ డకెట్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..? | ENG Vs AUS 5th ODI: England All Out For 309 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

ENG Vs AUS 5th ODI: బెన్‌ డకెట్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..?

Published Sun, Sep 29 2024 7:05 PM | Last Updated on Mon, Sep 30 2024 11:08 AM

ENG VS AUS 5th ODI: England All Out For 309 Runs

బ్రిస్టల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్‌ సాల్ట్‌ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు. 

విల్‌ జాక్స్‌ (0), జేమీ స్మిత్‌ (6), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (0), జేకబ్‌ బేథెల్‌ (13), బ్రైడన్‌ కార్స్‌ (9), మాథ్యూ పాట్స్‌ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్‌ రషీద్‌ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్‌ ఈ పరుగులు స్కోర్‌ చేయకుండి ఉంటే ఇంగ్లండ్‌ 300 పరుగుల మార్కును తాకేది కాదు. 

ఆసీస్‌ బౌలర్లలో ట్రవిస్‌ హెడ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్‌, ఆరోన్‌ హార్డీ, ఆడమ్‌ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. 

చదవండి: ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్‌.. వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement