కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం(PC: BCCI/Jio Cinema)
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు.
అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్‌నకు రెండో వికెట్ దక్కింది.
ఆ తర్వాత జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
ఇలా టాపార్డర్‌లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్‌కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment