బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టులో రెండో రోజు ఆట కూడా ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. చివరకు ఈ పోరులో టీమిండియా కాస్త వెనుకంజలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.