![IND vs NZ 2nd Test: Ashwin Overtakes Nathan Lyon To Become 7th Leading Wicket Taker In Tests](/styles/webp/s3/article_images/2024/10/24/lyon.jpg.webp?itok=sihaewuP)
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 24) మొదలైన రెండో టెస్ట్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్ తన వికెట్ల సంఖ్యను 531కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసీస్ స్పిన్ లెజెండ్ నాథన్ లయోన్‌ను (530) అధిగమించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) అశ్విన్ కంటే ముందున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అశ్విన్.. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డెవాన్ కాన్వే (76) వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (43), డారిల్ మిచెల్ (12) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.
తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే
చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment