India vs Australia Test Series: సమకాలీన క్రికెటర్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల తనకెంతో ఆసక్తి ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ అన్నాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకెన్నో సలహాలిచ్చాడని.. అతడితో మాట్లాడటం తనకెంతో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా రైట్‌ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన నాథన్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్.
కీలక బౌలర్‌గా..
ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 116 టెస్టులాడిన అతడు 461 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అతడు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై జట్టుకు మరింత కీలకంగా మారాడు.
అయితే, నాగ్‌పూర్‌లోని తొలి టెస్టులో అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటగా.. నాథన్ లియోన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. అరంగేట్ర టెస్టు ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు.
నాథన్ లియోన్
అశ్విన్ అంటే వణుకు
మరోవైపు.. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మొత్తంగా 8, రవీంద్ర జడేజా 7 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి టెస్టులో విజయంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్.. ఢిల్లీ మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను మట్టికరిపించాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. అశ్విన్ అంటే ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఎంత భయమో.. సిరీస్ ఆరంభానికి ముందే మరోసారి బయటపడిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఈ రైట్‌ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు తన డూప్లికేట్‌గా భావిస్తున్న మహేశ్ పితియా అనే యువ బౌలర్‌తో నెట్స్‌లో స్టీవ్ స్మిత్ తదితరులు ప్రాక్టీసు చేశారు. కానీ అసలు సమయానికి అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు.
అశ్విన్
వీడియోలు చూస్తూనే ఉన్నా.. నా భార్య విసిగెత్తిపోయింది!
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన నాథన్ లియోన్ అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అశ్విన్ అంటే ఏమిటో అతడి రికార్డులే చెబుతాయి. నేనైతే అశూకు పూర్తిగా భిన్నమైన బౌలర్‌ను.
నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే, ఇక్కడికి(ఇండియా) వచ్చే ముందు ఇంట్లో కూర్చుని అశ్విన్ ఫుటేజీలన్నీ చూశాను. లాప్‌టాప్‌లో తన బౌలింగ్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉండిపోయాను. నా ప్రవర్తన చూసి నా భార్య విసిగెత్తిపోయింది’’ అంటూ నాథన్ లియోన్ వ్యాఖ్యానించాడు.
ఎన్నో సలహాలు, సూచనలు
అశ్విన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న నాథన్ లియోన్... ‘‘ఆటలో ఉన్న గొప్పదనం అదే. ప్రతి రోజూ మరిన్ని మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థిని గమనించడం, వారి బలాబలాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అశ్విన్‌తో కలిసి కూర్చుని మాట్లాడినపుడు అతడు నాకెన్నో విషయాలు చెప్పాడు.
ఆస్ట్రేలియాలో ఉన్నపుడు కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. తను వైవిధ్యం కనబరచ గల బౌలర్. తన నైపుణ్యం అమోఘం. అందుకే అతడి నుంచి నేర్చుకున్న విషయాలు నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త చరిత్ర
Shubman Gill-Sara Tendulkar: వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..!
Comments
Please login to add a commentAdd a comment