Ind Vs Aus 4th Test: Ashwin picks Green, Carey wickets in same over, Viral Video - Sakshi
Sakshi News home page

Ind vs Aus: చెలరేగిన అశ్విన్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్‌.. ఇంకా! వీడియో వైరల్‌

Published Fri, Mar 10 2023 1:33 PM | Last Updated on Fri, Mar 10 2023 5:39 PM

Ind Vs Aus 4th Test Day 2: Ashwin Picks Green Carey Wickets In Same Over - Sakshi

India vs Australia, 4th Test- Ashwin Strikes 2 Video Viral: అహ్మదాబాద్‌ టెస్టులో రెండో రోజు ఆటలో ఎట్టకేలకు టీమిండియాకు కామెరాన్‌ గ్రీన్‌ రూపంలో తొలి వికెట్‌ దక్కింది.సెంచరీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఈ ఆల్‌రౌండర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో వికెట్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత జట్టుకు బ్రేక్‌ లభించింది.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి నాలుగో టెస్టు మార్చి 9న ఆరంభమైంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్‌.. రెండో రోజు కూడా దూకుడు ప్రదర్శించింది.

అద్భుతం చేసిన అశ్విన్‌
మొదటి రోజు శతకం పూర్తి చేసుకున్న ఉస్మాన్‌ ఖవాజాకు సహకారం అందిస్తూనే గ్రీన్‌ సైతం బ్యాట్‌ ఝులిపించాడు. 170 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్‌ 114 పరుగులు రాబట్టి భారత బౌలర్లకు కొరకరానికొయ్యగా తయారయ్యాడు.

ఖవాజా- గ్రీన్‌ జోడీని విడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ .. 131వ ఓవర్‌ వరకు ఇది సాధ్యపడలేదు. అయితే, టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఎట్టకేలకు గ్రీన్‌ వికెట​ పడగొట్టాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో 131వ ఓవర్‌ రెండో బంతిని స్వీప్‌షాట్‌ ఆడేందుకు గ్రీన్‌ ప్రయత్నించాడు. అయితే, వికెట్ల వెనకాల చురుగ్గా కదిలిన కీపర్‌ కేఎస్‌ భరత్‌ చక్కగా బంతిని ఒడిసిపట్టాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు
దీంతో గ్రీన్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది. 378 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇక అదే ఓవర్లో అశ్విన్‌ అలెక్స్‌ క్యారీ వికెట్‌ కూడా తీయడం విశేషం. అశూ బౌలింగ్‌లో ఆఖరి బంతికి అక్షర్‌కు క్యాచ్‌ ఇచ్చి క్యారీ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఎట్టకేలకు వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు. అశ్విన్‌ అనుభవం అక్కరకొచ్చింది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా 131 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 378 పరుగులు చేసింది.

చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం 
Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌.. సర్వెంట్‌ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement