ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు ఏమైనా ప్రభావం చూపిస్తారేమోనని భావించినప్పటికి ఆసీస్ బ్యాటర్లు ఆ చాన్స్ ఇవ్వలేదు. 76 పరుగుల టార్గెట్ 18.5 ఓవర్లలో చేధించిన ఆసీస్ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
కాగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో లబుషేన్ తన మైండ్‌గేమ్‌తో అశ్విన్‌కు చిరాకు తెప్పించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో లబుషేన్ ఉన్నాడు. అయితే అశ్విన్ తన రనప్ తగ్గించుకొని బంతిని వేయడానికి సిద్ధమయ్యాడు. ఇది గమనించిన లబుషేన్ పొజిషన్ తీసుకోకుండా సైడ్‌లైన్స్‌పై నిలబడ్డాడు. కావాలనే మైండ్‌గేమ్ ఆడడం అశ్విన్‌కు నచ్చలేదు.
కాసేపటికి లబుషేన్ స్ట్రైక్ తీసుకోవడానికి పొజిషన్‌కు రాగా.. అశ్విన్ తన చర్యతో లబుషేన్ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాడు. రనప్ తగ్గించుకుందామని చూసిన అశ్విన్ మళ్లీ తన ఒరిజినల్ రనప్ పొజిషన్‌కే వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్రెవిస్ హెడ్ అశ్విన్‌తో మాట్లాడడం కనిపించింది. ఈ క్రమంలో లబుషేన్, కెప్టెన్ రోహిత్ శర్మతో కాసేపు మాట్లాడి పరిస్థితి వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ashwin Anna pic.twitter.com/AZZ0ewlSzU
— Nitin Kumar (@NitinKu29561598) March 3, 2023
చదవండి: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment