
ఇస్లామాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లయిన్ ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌కే పరిమితమైన అశ్విన్‌ను భారత్‌లో ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు. భారత్‌తో పాటు ఉపఖండపు పిచ్‌లలో అతడు చాలా ప్రమాదకరి అని సక్లాయిన్ పేర్కొన్నాడు. విదేశీ పిచ్‌లపై కూడా రాణిస్తున్నప్పటికీ స్వదేశీ పిచ్‌లపైనే అతడికి మెరుగైన రికార్డులు ఉన్నాయన్నాడు. అంతేకాకుండా ఉపఖండపు పిచ్‌లపై అతడిని ఎదుర్కొనేందకు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చాలా ఇబ్బంది పడతారన్నాడు. రవీంద్ర జడేజా సైతం టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడని వివరించారు. (‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’)
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కుల్‌దీప్ బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ముస్తాక్ పేర్కొన్నాడు. కుల్‌దీప్‌తో అనేకమార్లు మాట్లాడానని మంచి మనసు గల వ్యక్తి అని అన్నాడు. క్రికెట్‌పై పరిజ్ఞానం, సానుకూల దృక్పథం కలిగిన ఆటగాడు కుల్‌దీప్ అని సక్లాయిన్ అభివర్ణించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్‌పై కూడా ఈ పాక్ మాజీ స్పిన్నర్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తాడు. లయన్ బౌలింగ్ అద్భుతంగా ఉందని, ఇంగ్లండ్, పాకిస్తాన్, భారత్ జట్లపై మెరుగ్గా రాణించాడని కొనియాడాడు. ప్రస్తుత క్రికెట్‌లో అతడు అత్యుత్తమ స్పిన్నర్లలో నాథన్ లయన్ అని పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదని సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. (‘బౌలింగ్ చేయమంటే భయపెట్టేవాడు’)
Comments
Please login to add a commentAdd a comment