India vs Australia, 1st Test Day 2- Suryakumar Yadav: టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అరంగేట్ర టెస్టులో తీవ్రంగా నిరాశపరిచాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో డెబ్యూ చేసిన సూర్య.. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. భారత ఇన్నింగ్స్ 60 ఓవర్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ వేసిన ఓ అద్భుతమైన బంతికి సూర్యకుమార్ క్లీన్ బౌల్డయ్యాడు.
ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో సూర్య ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్యకుమార్ తల ఊపుతూ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు కాదని సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో చోటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూర్య తొలి మ్యాచ్‌లోనే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితం కావడంతో.. అతడు టెస్టులకు సెట్‌కాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరి కొంత మంది సూర్య స్థానంలో గిల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం! ఆసుపత్రికి తరలింపు
Agressive intent 🤣🤣☝️☝️#SuryakumarYadav #shubhmangill pic.twitter.com/MMM8f05PCA
— Gill Stan (@gillified_) February 10, 2023
The Range of Sky#SuryakumarYadav pic.twitter.com/Un30ET8Y4o
— 𝙃𝙖𝙧𝙞𝙨𝙝🌾 (@Paisabarbaadbc1) February 3, 2023
SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏
Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u
— BCCI (@BCCI) February 9, 2023
Comments
Please login to add a commentAdd a comment