చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా! | WTC 2023-25: Nathan lyon Becomes First Bowler To Pick Two Five Wicket Hauls In WTC History - Sakshi
Sakshi News home page

WTC 2023-25: చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!

Published Sun, Mar 3 2024 10:24 AM | Last Updated on Sun, Mar 3 2024 12:07 PM

Nathan lyon becomes first bowler to pick two five wicket hauls in Wtc history - Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్‌ మయాజాలంతో కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్‌.. కివీస్‌ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్‌ దాటికి న్యూజిలాండ్‌ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లను లియోన్‌ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్‌ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్‌ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్‌ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్‌ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్‌ రికార్డును లియోన్‌ బ్రేక్‌ చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement