వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(59) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్‌తో పాటు హాజిల్‌వుడ్ రెండు, హెడ్, గ్రీన్ తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్ ముందు 369 పరుగులు భారీ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఉంచింది.
కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు:
ఆస్ట్రేలియా- 383 & 164
న్యూజిలాండ్- 179 & 196
ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment