India Vs Australia - BGT 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి పందొమ్మిదేళ్లకు పైనే అయింది. చివరిసారిగా 2004లో కంగారూలు భారత్‌లో ఈ ఫీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మళ్లీ ఇక్కడ టెస్టు సిరీస్ ట్రోఫీ గెలిచిందే లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాలని ప్యాట్ కమిన్స్ బృందం ఉవ్విళ్లూరుతోంది.
గెలుపు కోసం ఆసీస్ తహతహ
సొంతగడ్డపై వరుస సిరీస్‌లు గెలిచి సత్తా చాటిన ఆసీస్.. భారత్‌లోనూ అలాంటి ఫలితాలే రాబట్టాలని కోరుకుంటోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్ ఫైనల్ చేరే క్రమంలో ఈ ఫీట్ నమోదు చేయాలనే తలంపుతో ఉంది. ఇందుకు తగ్గట్లుగా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతోంది. ఓవరాల్‌గా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఉన్న ఆధిక్యాన్ని తగ్గించాలని ఆశపడుతోంది.
యాషెస్ కంటే పెద్ద విజయం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి, ప్రస్తుత వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఈ టెస్టు సిరీస్‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని మరోసారి తెలియజేశాయి. క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘అక్కడ టెస్టు సిరీస్ కాదు.. టెస్టు మ్యాచ్ గెలవడమే అత్యంత కష్టంతో కూడుకున్న పని.
మనం ఆ కొండను ఢీకొట్టగలిగితే.. గండాన్ని దాటగలిగితే.. అంతకంటే మించిన విజయం మరొకటి ఉండదు. మనం భారత్‌లో సిరీస్ గెలిస్తే.. దానిని యాషెస్ కంటే గొప్ప విజయంగా భావించవచ్చు’’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక స్పిన్నర్ నాథన్ లియోన్ మాట్లాడుతూ.. టీమిండియాలో సిరీస్ గెలవాలంటే కఠినంగా శ్రమించకతప్పదని.. అందులో తమ పాత్ర(స్పిన్ బౌలర్లు) మరింత కీలకం కానుందని పేర్కొన్నాడు.
అవును.. అంత వీజీ కాదు!
కాగా ఆసీస్ ఆటగాళ్లు అంగీకరించినట్లు.. స్వదేశంలో పటిష్ట టీమిండియాను ఢీకొట్టడం ఆసీస్‌కు అంత తేలికకాదు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల రూపంలో కంగారూ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా రోహిత్ సేన- ప్యాట్ కమిన్స్ బృందం మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: JSK Vs MICT: రషీద్ విఫలం.. ముగిసిన ఎంఐ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి?
Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఇదీ చదవండి: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ?
What’s tougher: An India tour, or away Ashes series?
— cricket.com.au (@cricketcomau) February 6, 2023
The Aussie Test stars have their say #INDvAUS pic.twitter.com/ljF0II6LBo
Comments
Please login to add a commentAdd a comment