ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలుత ఎల్బీ రూపంలో కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపిన లియోన్.. అనంతరం రోహిత్ శర్మ, పూజారా, శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఇప్పటివరకు 11ఓవర్లు బౌలింగ్ చేసిన లియోన్.. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. లంచ్ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 88 పరుగుల చేసింది.
లియోన్ సూపర్ డెలివరీ.. రోహిత్ క్లీన్ బౌల్డ్
కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అద్భుతమైన బంతితో లియోన్ బోల్తా కొట్టించాడు. భారత్ ఇన్నింగ్స్ 20 ఓవర్‌లో లియోన్ వేసిన ఓ సంచలన బంతికి రోహిత్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్‌సైడ్ పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి రోహిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన రోహిత్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 32 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం..
Comments
Please login to add a commentAdd a comment