Ind Vs Aus: Peter Handscomb Pulls Off Stunning Catch To Send Shreyas Iyer - Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియా ఫీల్డర్‌ అద్భుత విన్యాసం.. షాక్‌లో శ్రేయాస్! వీడియో వైరల్‌

Published Sat, Feb 18 2023 12:50 PM | Last Updated on Sat, Feb 18 2023 2:41 PM

Peter Handscomb pulls off stunning catch to send Shreyas Iyer - Sakshi

ఢిల్లీ వేదికగా భారత్‌తో జరగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్‌ హ్యాండ్‌కాంబ్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హ్యాండ్‌కాంబ్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌తో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో రెండో బంతిని అయ్యర్‌ లెగ్‌సైడ్‌ ఫ్లిక్‌ చేశాడు.

ఈ క్రమంలో ఫస్ట్‌ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యాండ్‌కాంబ్ డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే బంతి తొలుత నేరుగా అతడి చేతికి తగిలి కాస్త పైకి వెళ్లింది. వెంటనే అతడు వెంటనే డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇక ఇది చూసిన అయ్యర్‌ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఈ సంచలన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లియోన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటివరకు 15 ఓవర్లు బౌలింగ్‌ చేసిన లియోన్‌.. 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి(30), రవీంద్ర జడేజా(25) భారత ఇ‍న్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు.
చదవండి: ENG vs NZ: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement