న్యూఢిల్లీ: గడిచిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్ పరంగా చూస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు పరుగుల వరద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే 2017 స్పిన్నర్లకు కూడా బాగా కలిసొచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే గతేడాది స్పిన్నర్స్‌కు సూపర్ ఇయర్‌గా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా స్పిన్నర్లు రెచ్చిపోయి వికెట్లు సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన ఘనతను స్పిన్నర్లు మొదటిసారి తమ ఖాతాలో వేసుకున్నారు.
2017లో స‍్పిన్నర్లు సాధించిన టెస్టు వికెట్లు 638. ఫలితంగా గతేడాది స్పిన్నర్లు సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు(584)ను బద్దలు కొట్టారు. ఓవరాల్‌గా స్పిన్నర్లు ఐదు వందలకు పైగా సాధించింది కేవలం ఐదుసార్లు మాత్రమే. 2001లో 521 టెస్టు వికెట్లను తీసిన స్పిన్నర్లు.. 2004లో 577 వికెట్లు సాధించారు. ఇక 2015లో 554 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లయాన్(63), అశ్విన్(56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment