అనిల్ కుంబ్లేతో అశ్విన్(ఫైల్ ఫొటో)
దుబాయ్: స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు తాను వీరాభిమానినని, టెస్టుల్లో ఆయన వికెట్ల రికార్డును ‘అందుకునే’ సాహసం చేయనని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. కుంబ్లే సాధించిన వికెట్లకు ఒక వికెట్ తక్కువగా సాధించిన క్షణా న్నేతాను ఆట నుంచి తప్పుకుంటానని అతను అన్నాడు. జనరేషన్ నెక్స్‌ట్ పేరుతో అశ్విన్ తన సొంత అకాడమీని దుబాయ్‌లో శుక్రవారం ప్రారంభించాడు.
‘కుంబ్లే టెస్టుల్లో 619 వికెట్లు తీశారు. నా ఆట బాగుండి, అదృష్టవశాత్తూ నేను అంత దూరం వెళ్లగలిగితే సంతోషం. కానీ నేను 618 వికెట్లు తీశానంటే అదే నా ఆఖరి టెస్టు అవుతుంది. ఆపై మరో వికెట్ కూడా తీయను’ అంటూ కుంబ్లేతో సమానంగా నిలవలేనని అశ్విన్ గౌరవాన్ని ప్రదర్శించాడు. 1998లో పాకిస్తాన్‌తో పెషావర్‌లో జరిగిన టెస్టులో ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా బ్రాడ్‌మన్ పట్ల ఇలాంటి గౌరవాన్నే చూపిం చాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 334 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్ టేలర్... తాను బ్రాడ్‌మన్ అత్యధిక స్కోరు (334)ను అందుకోవడమే గొప్ప అని, దానిని దాటలేనంటూ మూడో రోజు క్రీజ్‌లోకి రాకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 31 ఏళ్ల అశ్విన్ ఇప్పటి వరకు 52 టెస్టుల్లోనే 292 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment