
సాక్షి, హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు, అభిమానులు, బర్త్‌డే విషెస్ చెప్పేందుకు పోటీపడ్డారు. కానీ నలుగురు ఫేమస్ క్రికెటర్లు మాత్రం కోహ్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపలేదు. అయితే ఈ నలుగురి క్రికెటర్లతో గతంలో కోహ్లికి వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదాలు అందరికి బాహటంగా తెలిసినవే. ఈ వివాదాల కారణంగానే వారు కోహ్లికి విషెస్ చెప్పలేదేమో అనే ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు క్రికెటర్లు ఎవరంటే..? ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్, ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.
చెల్లుకు చెల్లు..
ఇక అనిల్ కుంబ్లే- కోహ్లిల మధ్య వివాదం కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకునే వరకు దారితీసింది. కానీ ఈ వివాదం గురించి ఈ ఇద్దరూ బాహటంగా ప్రస్తావించకపోయిన వారు చేసిన కొన్ని పనుల వల్ల తెలిసిపోయింది. టీచర్స్ డే రోజు కోహ్లి షేర్ చేసిన ఫోటోలో కుంబ్లే లేకపోవడం.. కుంబ్లే బర్త్‌డే రోజు కోహ్లి విష్ చేయకపోవడంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు కుంబ్లే కూడా సైలెంట్‌గా చెల్లుకు చెల్లు అన్నట్లు ఉండటంతో వీరి మధ్య గొడవ మాటల్లేనంత అయి ఉంటుందని తెలుస్తోంది.
2017 భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా చోటు చేసుకున్న రివ్యూవివాదం కోహ్లి-స్మిత్‌ల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. స్మిత్ ఓ ఛీటర్ అంటూ కోహ్లి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం లేపాయి. ఇక 2016 భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లి- అండర్సన్ మధ్య వివాదం చోటు చేసుకుంది. కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో సహనం కోల్పోయిన అండర్సన్ నోరుపారేసుకున్నాడు. ఇక జాన్సన్‌కు కోహ్లికి మధ్య 2014 బాక్సింగ్ టెస్టులో వివాదం చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ యాజమాని విజయ్ మాల్యా సైతం బర్త్ డే విషెస్ తెలపలేదు.