2016లో భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుంబ్లే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్-2017లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిపాల్వడంతో కుంబ్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. మరోవైపు బీసీసీఐ కూడా కావాలనే అతడి కాంట్రక్ట్‌ను పొడిగించలేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఇక ఈ ఏడాది కాలంలో అనిల్ కుంబ్లే, అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య చాలా విబేధాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకునేదాకా వెళ్లారు. ఇక తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుంబ్లే భారత హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక, తనని ఆ బాధ్యతలు చేపట్టమని బీసీసీఐ కోరింది అని సెహ్వాగ్ తెలిపాడు.
"2017లో అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, విరాట్ కోహ్లి నన్ను కలిశారు. కోహ్లి, కుంబ్లేల మధ్య ఎంత ప్రయత్నించినా సఖ్యత కుదరడం లేదని అమితాబ్ నాతో చెప్పాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లే కాంట్రాక్ట్ గడువు ముగియనుందని, అనంతరం భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే హెడ్ కోచ్ స్థాయిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లవచ్చు అని చెప్పాడు. కోహ్లి కూడా అదే విషయం నన్ను అడిగాడు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా జీవితంలో నేను సాధించిన దానితో సంతోషంగా ఉన్నాను.
నజాఫ్‌గఢ్‌లోని చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు భారత్ తరపున ఆడే అవకాశం వచ్చింది. ఎంతో మంది అభిమానులను, వారి ప్రేమను పొందాను. అది నా జీవితానికి చాలు. ఒక వేళ నేను కెప్టెన్‌గా ఉన్న ఇదే గౌరవం పొందే వాడిని" అని న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: Asia cup 2023: భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగాలి.. మోడీ సార్‌నే అడుగుతా?
Comments
Please login to add a commentAdd a comment