రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే రాజ్‌కోట్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
రాజ్‌కోట్ టెస్టులో అశ్విన్ మరో 4 వికెట్లు పడగొడితే.. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్‌లో 346 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 350 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్ధానంలో ఉన్నాడు.
అయితే అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదేవిధంగా అశ్విన్ మరో ఒక్క వికెట్ సాధిస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా, రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment