
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతుందని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టోర్నీపై నమ్మకంతోనే ఉన్నాం. షెడ్యూలును కుదించి అయినా, మూడు లేదా నాలుగు వేదికలకే పరిమితం చేసైనా ఈ సీజన్ జరగాలని ఆశిస్తున్నాం. ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరగొచ్చు’ అని కుంబ్లే తెలిపాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని ఫ్రాంచైజీ నగరాల్లో కాకపోయినా కొన్ని వేదికల్లో ఐపీఎల్ జరిగి తీరుతుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పాడు. ‘ప్రయాణ బడలికలు తగ్గించే ఉద్దేశంతో ఎంపిక చేసిన కొన్ని వేదికల్లో పోటీలు జరుగుతాయి’ అని అన్నాడు. ఫ్రాంచైజీలు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా ఆలోచన చేస్తాయన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment