ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ (30,074) నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం కర్ట్‌నీ వాల్ష్ (30,019)ను అధిగమించాడు. ఓవరాల్‌గా ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక బంతులేసిన ఆటగాడిగా అండర్సన్ తొలి స్థానంలో నిలిచాడు. 132 టెస్టులు ఆడిన ఈ ఇంగ్లీష్ బౌలర్ 539 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 887పాయింట్లతో అండర్సన్ రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్ రబడా 899 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టెస్టుల్లో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో శ్రీలంకకు చెందిన ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్టుల్లో 44,039 బంతులు) తొలి స్థానంలో ఉన్నాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132 టెస్టుల్లో 40,850 బంతులు) రెండో స్థానంలో, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్(145టెస్టుల్లో 40,705 బంతులు) మూడో స్థానంలో ఉన్నారు. కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 0-1తో కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment