India vs Australia, 2nd Test - Ravichandran Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.
వంద వికెట్ల ఘనత
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీని డకౌట్ చేసి.. ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
అగ్రస్థానంలో వార్న్
ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడు.. 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో మూడో సెషన్ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 199(56 ఓవర్లు) చేయగలిగింది. ఇక క్యారీ కంటే ముందు అశూ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్
GONEEEEE!#TeamIndia bowlers have the ball talking and Aussie batters dancing to their tunes!
— Star Sports (@StarSportsIndia) February 17, 2023
Ashwin gets two huge wickets of Labuschagne and Smith! 🔥
Tune-in to the action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire pic.twitter.com/xxgiqyrRau
Comments
Please login to add a commentAdd a comment