
భారత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే
సాక్షి, బెంగుళూరు : రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో మిషన్–150 లక్ష్యాన్ని చేరుకునే దిశలో కార్యకలాపాలను రూపొందించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రముఖ క్రికెట్ క్రీడాకారులకు గాలం వేసింది. క్రికెట్ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
యువ ఓటర్లను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లను పార్టీలోకి చేర్చుకోవాలని యోచించింది. దీంతో ఈ ఇద్దరి క్రికెట్ ఆటగాళ్లలో పార్టీకి చెందిన ప్రముఖ నేత పలుమార్లు చర్చించారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు తాము రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తేల్చేయడంతో బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి.