భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి 9 నుంచి) నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా కన్నేసింది.
ఇదే సమయంలో నాలుగో టెస్టులో అందరి చూపు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పైనే ఉన్నాయి. అందుకు ఒక కారణం ఉంది. భారత స్టార్ బౌలర్ అశ్విన్ నాలుగో టెస్టులో భారత లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకావం ఉంది. ఆసీస్‌తో నాలుగో టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డు కుంబ్లే పేరిట ఉంది.
ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 111 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. ఇది కాకుండా స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో కుంబ్లే, అశ్విన్ ఇద్దరూ తలో 25 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు.
దీనితో పాటు మరో రికార్డు కూడా ఎదురుచూస్తోంది. మ్యాచ్‌లో అశ్విన్ 10 వికెట్లు తీస్తే అన్ని ఫార్మాట్లు కలిపి 700 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. ఇప్పటివరకు కుంబ్లే(956 వికెట్లు), హర్భజన్(707 వికెట్లు) మాత్రమే ఉన్నారు.
ఇక నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment