On Anil Kumble Birthday, BCCI Shares 10 Wicket Haul Vs Pakistan: టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో అతను పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. 403 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 956 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ ట్వీట్‌లో పేర్కొంది. కుంబ్లే విషెస్ తెలిపిన వారిలో బీసీసీఐతో పాటు పలువురు ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు.
4⃣0⃣3⃣ intl. games 👍
— BCCI (@BCCI) October 17, 2021
9⃣5⃣6⃣ intl. wickets 👌
Only the second bowler in Test cricket to scalp 10 wickets in an innings 👏
Wishing former #TeamIndia captain @anilkumble1074 a very happy birthday. 🎂 👏
Let's revisit his brilliant 1⃣0⃣-wicket haul against Pakistan 🎥 🔽 pic.twitter.com/BFrxNqKZsN
కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కుంబ్లే.. 132 టెస్ట్‌లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 619 వికెట్లతో పాటు ఓ సెంచరీ 5 అర్ధ సెంచరీలు చేసిన జంబో(కుంబ్లేని ముద్దుగా పిలిచే పేరు).. వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే టెస్ట్‌ల్లో నేటికి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ తర్వాత నాలుగో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2008 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జంబో.. 2016-17 సంవత్సరాల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు.
చదవండి: ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి
Comments
Please login to add a commentAdd a comment