February 7, 1999: Anil Kumble became second bowler to take all 10 wickets against Pakistan - Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో ఇద్దరే ఇద్దరు, అందులో మన వాడు.. ఆ చారిత్రక ఘట్టానికి 24 ఏళ్లు

Published Tue, Feb 7 2023 3:14 PM | Last Updated on Tue, Feb 7 2023 3:28 PM

Anil Kumble Became 2nd Bowler To Take All 10 wickets Vs Pakistan On February 7th 1999 - Sakshi

Anil Kumble 10 Wickets Haul Vs Pakistan: క్రికెట్‌ చరిత్రలో ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1999వ సంవత్సరంలో ఈ తేదీన ఢిల్లీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (10/74) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 1956లో ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత (10/53) సాధించగా, ఆ ఘనతను తిరిగి 43 ఏళ్ల తర్వాత అనిల్‌ కుంబ్లే రెండో సారి నమోదు చేశాడు.

కుంబ్లే సాధించిన ఈ ఘనతకు నేటితో 23 పూర్తై 24 ఏళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కుంబ్లే చారిత్రక ప్రదర్శనను నేటి దినాన క్రికెట్‌ అభిమానులు స్మరించుకుంటున్నారు. కుంబ్లే నమోదు చేసిన గణాంకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జనరేషన్‌ అభిమానులైతే 10కి 10 వికెట్లు తీయడం ఎలా సాధ్యపడిందని చర్చించుకుంటున్నారు.

నాటి మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. సదగోపన్‌ రమేశ్‌ (60), మహ్మద్‌ అజహారుద్దీన్‌ (67) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో అనిల్‌ కుంబ్లే (4/75), హర్భజన్‌ సింగ్‌  (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌటైంది. షాహిద్‌ అఫ్రిది (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆ తర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటై పాక్‌కు 420 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఈ ఇన్నింగ్స్‌లోనే కుంబ్లే మ్యాజిక్‌ చేశాడు. 101 పరుగుల వరకు ఒక్క వికెట్‌ కోల్పోని పాక్‌ను కుంబ్లే ఒక్కడే 207 పరుగులకు ఆలౌట్‌ చేశాడు. ఈ చారిత్రక ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement