ఏషియన్ గేమ్స్(ఆసియా క్రీడలు)-2023కు చైనా అతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చైనాలోని హాంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు. ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే చేర్చారు. చివరగా 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్‌ను భాగం చేశారు.
అయితే ఈ క్రీడల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్ జట్లు ఆడినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు మాత్రం ఒక్క సారి కూడా పాల్గొనేలేదు. అయితే ఈ సారి కూడా తమ బీజీ షెడ్యూల్ కారణంగా ఆసియాక్రీడల్లో భారత క్రికెట్ జట్టు భాగం కాదని బీసీసీఐ గతంలో తెలిపింది. కానీ బీసీసీఐ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత పురుష, మహిళ జట్లను పంపించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆసియా క్రీడలకు భారత ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కూడా పాల్గోనుంది. ఆసియాక్రీడలకు సీనియర్ మహిళల జట్టునే బీసీసీఐ పంపే ఛాన్స ఉంది. జూన్ 30లోపు బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి ఆటగాళ్ల జాబితాను పంపనున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆసియాకప్-2023లో దాయుదులు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 31 నుంచి శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా జరగనుంది.
చదవండి: #CWCQualifiers2023: కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్, వరుసగా రెండో విజయం
Comments
Please login to add a commentAdd a comment