leg spinner
-
క్రికెట్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు, అందులో మన వాడు.. ఆ చారిత్రక ఘట్టానికి 24 ఏళ్లు
Anil Kumble 10 Wickets Haul Vs Pakistan: క్రికెట్ చరిత్రలో ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1999వ సంవత్సరంలో ఈ తేదీన ఢిల్లీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (10/74) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 1956లో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత (10/53) సాధించగా, ఆ ఘనతను తిరిగి 43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే రెండో సారి నమోదు చేశాడు. కుంబ్లే సాధించిన ఈ ఘనతకు నేటితో 23 పూర్తై 24 ఏళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కుంబ్లే చారిత్రక ప్రదర్శనను నేటి దినాన క్రికెట్ అభిమానులు స్మరించుకుంటున్నారు. కుంబ్లే నమోదు చేసిన గణాంకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జనరేషన్ అభిమానులైతే 10కి 10 వికెట్లు తీయడం ఎలా సాధ్యపడిందని చర్చించుకుంటున్నారు. 2⃣6⃣.3⃣ Overs 9⃣ Maidens 7⃣4⃣ Runs 1⃣0⃣ Wickets 🗓️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings 🔝 👏 Revisit that special feat 🔽 pic.twitter.com/wAPK7YBRyi — BCCI (@BCCI) February 7, 2023 నాటి మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. సదగోపన్ రమేశ్ (60), మహ్మద్ అజహారుద్దీన్ (67) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే (4/75), హర్భజన్ సింగ్ (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌటైంది. షాహిద్ అఫ్రిది (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటై పాక్‌కు 420 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఈ ఇన్నింగ్స్‌లోనే కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 101 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని పాక్‌ను కుంబ్లే ఒక్కడే 207 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఈ చారిత్రక ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. -
ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అరుదైన రికార్డు
Rehan Ahmed: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ద్వారా ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్.. 18 ఏళ్ల 126 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉంది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహాన్.. గత కౌంటీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ఇంగ్లండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రెహాన్.. ఇంగ్లండ్ తరఫున ఇదివరకే టీ20 అరంగేట్రం చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఇవాళ (డిసెంబర్ 17) ప్రారంభమైన మూడో టెస్ట్‌ల్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వలేదనిపించారు. బాబర్ ఆజమ్ (43), సౌద్ షకీల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ తలో వికెట్ పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత
Former Australia Spinner Peter Philpott Passed Away: ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ అలన్ డేవిడ్సన్ కన్నుమూసిన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ స్పిన్నర్ పీటర్ ఫిల్పాట్ 86 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశాడు. పీటర్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అయిన పీటర్.. 60వ దశకంలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. 8 టెస్ట్‌ల్లో 38.46 సగటుతో 26 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగానే పీటర్ 31 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. చదవండి: టీమిండియాతో మ్యాచ్ రోజు పాక్ కెప్టెన్ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..! -
కోహ్లి వికెట్.. టెస్టుల్లో చోటు?
లండన్: ఎవరి తలరాతైనా మారడానికి ఒకే ఒక్క క్షణం చాలు. అదే విధంగా ఒక క్రికెటర్ వికెట్, క్యాచ్, ఆఖరికి ఒక్క పరుగు సాధించి కూడా హీరో అయిన సందర్భాలు అనేకం. నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన పైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్పు అందించి.. నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనుభూతినే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఆస్వాదిస్తున్నాడు. టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సాఫీగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది అదిల్ రషీదే. జోరు మీదున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ని అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇదే ఇప్పుడు రషీద్ పాలిట అదృష్టంగా మారింది.. టెస్టుల్లో పునరాగమనానికి మార్గం సుగమం చేసింది. సుమారు రెండేళ్ల తర్వాత? అదిల్ రషీద్ ఇప్పటివరకు ఆడిన పది టెస్టుల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ సెలక్టర్లు టెస్టులకు ఈ ఆటగాడిని పక్కకు పెట్టి వన్డే, టీ20లకే పరిమితం చేశారు. ఈ లెగ్ స్పిన్నర్ ఆడిన చివరి టెస్టు 2016లో భారత్ పైనే. ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం లభించింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంగ్లండ్‌కు టెస్టుల్లో సీనియర్ స్పిన్నర్ లేకపోవడం, వన్డేల్లో అదరగొట్టిన ఈ ముప్పై ఏళ్ల ఆటగాడిని టెస్టుల్లో ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం. తొలి లెగ్‌స్పిన్నర్.. స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కొని పరుగులు సాధించే టీమిండియా సారథిని రషీద్ ఔట్ చేసి అరుదైన ఘనతన సాధించాడు. ఇప్పటివరకు లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి క్లీన్‌బౌల్డ్ కాలేదు. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిని రషీద్ క్లీన్‌బౌల్డ్ చేసి ఆ రికార్డును తుడిచిపాడేశాడు. చదవండి: ఆ బంతికి బిత్తరపోయిన కోహ్లి -
పది వికెట్లు.. పది మేడిన్లు!
నర్మదాపురం: భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన ఘనత ప్రతీ క్రికెట్ అభిమాని మదిలో చెరిగిపోని జ్ఞాపకమే. 1999లో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే 10 వికెట్లను తీసి అరుదైన ఘనతను సాధించాడు. అయితే ఆ అద్భుతమైన గణాంకాలను మరోసారి గుర్తు చేశాడు మధ్యప్రదేశ్ కు చెందిన పాలాష్ కోచర్. గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న ఈ యువ బౌలర్ తాజాగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో 10 వికెట్లను తీసి శభాష్ అనిపించాడు. అండర్ -23లో భాగంగా ఇంటర్ డివిజనల్ ఎమ్ వే మెమోరియల్ జట్టుకు ఆడుతున్న పాలాష్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. నర్మదాపురంతో జరిగిన మ్యాచ్‌లో పాలాష్ తన లెగ్ స్పిన్ మంత్రంతో చెలరేగిపోయాడు. పాలాష్ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు విలవిల్లాడిపోయారు. పాలాష్ 28.1 ఓవర్లపాటు బౌలింగ్ వేసి పది వికెట్లను సాధించడంతో పాటు 10.0 మేడిన్ ఓవర్లు వేసి సత్తా చాటుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లను తీసిన తొలి బౌలర్‌గా పాలాష్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు బౌలర్లు మాత్రమే సొంతం చేసుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా 1956 లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కు చెందిన జిమ్ లేకర్ 10 వికెట్లను సాధించి ఆ మైలురాయిని నమోదు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆ తరువాత 43 ఏళ్లకి అనిల్ కుంబ్లే ఆ ఘనతను సాధించాడు. -
ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా
మొరాదాబాద్: భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలైన అనుభూతి చౌహాన్‌ను శుక్రవారం రాత్రి పెళ్లాడాడు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, క్రికెట్ సహచరులు ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, జ్ఞానేంద్ర పాండే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబీఏ చదివిన అనుభూతి కుటుంబం గతంలో చావ్లా ఇంటి పక్కనే ఉండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం పెళ్లికి దారితీసింది. అనుభూతి తండ్రి డాక్టర్ అమర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మీరట్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, స్థానిక ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినా.. కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.