యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈనెల (అక్టోబర్) 14న జరుగనున్న ఈ హైఓల్టేజీ పోరుకు సంబంధించి 14,000 టికెట్లను ఇవాళ (అక్టోబర్ 8) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి వరల్డ్‌కప్ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌లో ( https://tickets.cricketworldcup.com,”) టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 7, 2023
BCCI set to release 14,000 tickets for India v. Pakistan League Match on October 14, 2023.
Details 🔽 #CWC23 https://t.co/p1PYMi8RpZ
కాగా, వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి అదనపు టికెట్లు విడుదల చేయడం ఇది తొలిసారి కాదు. గత నెలలో కూడా బీసీసీఐ భారీ సంఖ్యలో టికెట్లను విడుదల చేసింది. వరల్డ్‌కప్-2023 ఓపెనింగ్ మ్యాచ్‌కు (ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్) ప్రేక్షకుల ఆదరణ కరువైన నేపథ్యంలో బీసీసీఐ టికెట్ల సంఖ్యను పెంచుతూ జనాలను ఆకర్శించే పనిలో పడింది. భారత్-పాక్ మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడమే లక్ష్యంగా బీసీసీఐ పెద్దలు అదనపు టికెట్లను రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. ఇవాళ (అక్టోబర్ 8) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో నెదార్లండ్స్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment