
న్యూఢిల్లీ : భారతజట్టులో తాను ఆడిన సమయంలో అనిల్ కుంబ్లేనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు. సారథులుగా సౌరవ్ గంగూలీ, మహీంద్ర సింగ్ ధోనీలు రికార్డుల పరంగా మెరుగ్గా ఉన్నా, తనకు కుంబ్లేనే బెస్ట్ అని బుధవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ చెప్పారు.
సౌరవ్ కూడా అద్భుతంగా సారథ్యం వహించారు, అయితే టీమిండియాకు కెప్టెన్‌గా సుదీర్ఘకాలం ఉండాలనుకున్నది మాత్రం అనిల్ కుంబ్లేనే అని గంభీర్ తెలిపారు. అతడి సారథ్యంలో తాను ఆరు టెస్టులు ఆడానన్నారు. కుంబ్లే ఎక్కువ కాలం భారత జట్టుకు సారథ్యం వహించి ఉంటే కెప్టెన్‌గా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేవాడని పేర్కొన్నారు. 2007లో రాహుల్ ద్రవిడ్ నుంచి కెప్టెన్సీ పగ్గాలను అనిల్ కుంబ్లే అందుకున్నారు. 14టెస్టుల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా కుంబ్లే వ్యవహరించారు. వీటిలో మూడింట్లో గెలవగా, ఆరు మ్యాచ్‌లలో భారత్ ఓటమిపాలయ్యింది. ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ తరపును వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, 2008 నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment