న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్కు స్పిన్‌తో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. 2014లో యూఏఈలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో రాణించడంతో కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కానీ 2017లో అతని అరంగేట్రం షురూ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కుల్దీప్ టెస్టు అరంగేట్రం జరిగింది. అయితే ఆ సమయంలోనే దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ను కలిసే కుల్దీప్‌కు లభించింది. అప్పుడు టీమిండియా కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే.. కుల్దీప్‌ను వార్న్‌కు పరిచయం చేశాడంట. తాను వార్న్‌ను కలుస్తానంటూ అనిల్ భాయ్‌ను కోరి మరీ కలిశానంటూ కుల్దీప్ తెలిపాడు. టీవీ ప్రెజెంటర్ మడోనా టిక్సియారా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో పాల్గొన్న కుల్దీప్.. ఈ విషయాన్ని వెల్లడించాడు. అదొక మధుర జ్ఞాపకంగా పేర్కొన్న కుల్దీప్.. వార్న్‌తో తన బౌలింగ్ గురించి చాలా విషయాలను చెప్పినట్లు తెలిపాడు. (మరో రెండేళ్లు ‘కింగ్స్’లో ధోని)
‘నేను పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార్న్‌ను కలిశా. వార్న్‌ను కలవడం అదే తొలిసారి. ఆసమయంలో మాకు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే భాయ్ ఉన్నారు. షేన్ వార్న్‌ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు కుంబ్లేకు చెప్పా. చివరికు కుంబ్లే సాయంతో వార్న్‌ను కలిశా. కానీ పది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా. వార్న్ కలిశాక మైండ్ బ్లాక్ అయ్యింది. కుంబ్లే-వార్న్‌లు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు అలా వింటూనే ఉన్నా. చివరగా మాట్లాడం ఆరంభించా. చాలా విషయాలను వార్న్‌తో పంచుకున్నా. నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేది వార్న్‌కు చెప్పుకొచ్చా.
వికెట్‌కు రెండు వైపులా బంతిని ఎలా సంధిస్తాను అనే విషయాన్ని వార్న్‌కు వివరించా. అయితే అంతా విన్న వార్న్.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అని అన్నాడు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వార్న్ తెలిపాడు. బ్యాట్స్‌మన్ మదిలో ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు అనే దానిని ఊహిస్తూ బౌలింగ్ చేయమని వార్న్ సలహా ఇచ్చాడు’ అని కుల్దీప్ తెలిపాడు. కాగా, ఆ తర్వాత వార్న్‌ను చాలాసార్లు కలిసే అవకాశం దక్కిందన్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతుండగా వార్న్ కామెంటేటర్‌గా ఉండగా కలిసే అవకాశం దొరికిందన్నాడు. ఒక కోచ్ ఎలా అయితే చెబుతాడో అలానే పలు విషయాల్ని వార్న్ తనకు చెప్పాడన్నాడు. అవి తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కుల్దీప్ పేర్కొన్నాడు.(మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం)
10 నిమిషాలు మైండ్ బ్లాక్: కుల్దీప్
Published Thu, Aug 13 2020 2:37 PM | Last Updated on Thu, Aug 13 2020 2:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment