ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా.. 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), కిషన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
దీంతో 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్‌వుడ్(20) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి మరో 8 వికెట్లు అవసరమమవ్వగా.. వెస్టిండీస్‌కు ఇంకా 289 పరుగులు కావాలి.
అశ్విన్ అరుదైన రికార్డు..
ఇక విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు విండీస్‌పై 75 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(74)ను అశ్విన్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కపిల్ దేవ్(89) ఉన్నారు.
చదవండి: IND vs WI: రోహిత్, కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment