వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విండీస్ బ్యాటర్లకు అశ్విన్ చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు అశూ 12 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకు 271 మ్యాచ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 709 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్(707)ను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్ కెరీర్‌లో 27 ఫోర్ వికెట్, 34 ఫైవ్ వికెట్, ఎనిమిది 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.
► వెస్టిండీస్‌పై ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అదే విధంగా విండీస్‌పై ఒకే టెస్టులో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి స్పిన్నర్‌గా అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్ పేరిట ఉండేది. 2011లో జరిగిన ఓ టెస్టులో అజ్మల్ 11 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో అజ్మల్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
►విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన దివంగత ఆసీస్ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. వీరిద్దరూ 28 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించారు.
►టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా అశ్విన్(34 సార్లు) నిలిచాడు . శ్రీలంక తరుపున 34 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన రంగనా హేరాత్ రికార్డును సమం చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు.
చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment