రోహిత్ శర్మ- అనిల్ కుంబ్లే
Anil Kumble Comments: ‘‘టీమిండియా స్పిన్ విభాగంలో అశ్విన్- జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ అత్యంత నాణ్యమైన స్పిన్ బౌలర్లు. మూడో స్పిన్నర్‌గా ఉన్న అక్షర్ పటేల్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే వీరితో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా వరుస ఛాన్స్‌లు ఇస్తే బాగుంటుంది’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు.
కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అశ్విన్, జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అశూ ఏకంగా 12 వికెట్లతో చెలరేగి విండీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరోవైపు జడ్డూ సైతం 5 వికెట్లతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో టీమిండియా.. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
అద్భుత నైపుణ్యాలు కలిగిన వాడు
ఈ నేపథ్యంలో అశూ- జడ్డూలను కొనియాడిన అనిల్ కుంబ్లే.. కుల్దీప్ యాదవ్‌ను కూడా అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు. ‘‘కుల్దీప్ అద్భుత నైపుణ్యాలు కలవాడు. అతడికి కచ్చితంగా జట్టులో చోటివ్వాలి.
నిజానికి లెగ్ స్పిన్నర్లు అటాకింగ్‌గా ఉంటారు. అయితే కొన్నిసార్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు కూడా! అలా అని వాళ్లను పక్కనపెట్టకూడదు. నైపుణ్యాలకు మరింతసాన బెట్టుకునేలా ప్రోత్సహించాలి. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలి.
టెస్టు జట్టులోకి తీసుకురావాలి
టెస్టులకు కుల్దీప్ పనికివస్తాడు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా మంది మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ మనం వాళ్ల సేవలను టెస్టుల్లో వినయోగించుకోలేకపోతున్నాం’’ అని కుంబ్లే జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో చివరిగా
కాగా 28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ చివరిగా గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున ఆడాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్థానం దక్కింది కానీ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను ఉద్దేశిస్తూ కుంబ్లే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే..
Comments
Please login to add a commentAdd a comment