ఆ సత్తా కోహ్లి గ్యాంగ్‌కు ఉంది: కుంబ్లే | Anil Kumble Confident Of Virat Kohli Led India Creating History In South Africa | Sakshi
Sakshi News home page

ఆ సత్తా కోహ్లి గ్యాంగ్‌కు ఉంది: కుంబ్లే

Published Sun, Dec 17 2017 10:08 PM | Last Updated on Sun, Dec 17 2017 10:08 PM

Anil Kumble Confident Of Virat Kohli Led India Creating History In South Africa - Sakshi

బెంగళూరు:భారత​ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో విభేదాల కారణంగా కొన్ని నెలల క్రితం ప్రధాన కోచ్‌ పదవికి రాజీనామా చేసిన అనిల్‌ కుంబ్లే తాజాగా జట్టు ప్రదర్శనపై పెదవి విప్పాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోయే విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా సఫారీలను వారి దేశంలో భారత జట్టు ఓడిస్తారని నమ్మకం ఉందన్నాడు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన కుంబ్లే.. కోహ్లి అండ్‌ గ్యాంగ్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. టీమిండియా వరుస విజయాల వెనుక విరాట్‌ కృషి ఎంతో ఉందన్నాడు. మరొకవైపు అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఆటగాళ్లకు కోచ్‌లు పెద్దగా చెప్పేది ఏమి ఉండదన్నాడు. అదే సమయంలో జట్టు విజయాల వెనుక కోచ్‌ల పాత్ర కూడా ఏమీ ఉండదని కుంబ్లే పేర్కొన్నాడు. ఏడాదికి పైగా జట్టుతో కలిసి పని చేయడం ఒక మధురమైన అనుభూతి అన్నాడు.  ఈ మేరకు జట్టు సభ్యులకు కుంబ్లే కృతజ్ఞతలు తెలియజేశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement