
Tim Southee Breaks Anil Kumble Record Most Wickets IND vs NZ.. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బౌలింగ్ తనదైన పేస్‌తో మెప్పిస్తున్న సౌథీ వికెట్లతో చెలరేగుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిసిన సౌథీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే సౌథీ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు.
చదవండి: Kyle Jamieson: 1865 బంతులు.. కైల్ జేమీసన్ అరుదైన ఘనత
సౌథీ టీమిండియాపై ఇప్పటివరకు 10 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. తద్వారా న్యూజిలాండ్ తరపున ఒక బౌలర్ టీమిండియాపై ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కివీస్ తరపున రిచర్డ్ హడ్లీ(1976-90) టీమిండియాపై 14 టెస్టుల్లో 65 వికెట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు.
ఇక ఓవరాల్‌గా టీమిండియా- న్యూజిలాండ్ బై లేటరల్ టెస్టు సిరీస్ పరంగా చూసుకుంటే సౌథీ.. భారత లెగ్‌స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌పై 50 వికెట్లు తీసిన కుంబ్లేను తాజాగా సౌథీ అధిగమించాడు. ఈ జాబితాలో రిచర్డ్ హడ్లీ(65 వికెట్లు) తొలి స్థానంలో.. బిషన్ సింగ్ బేడీ(57 వికెట్లు) రెండో స్థానంలో.. ప్రసన్న(55 వికెట్లు) మూడో స్థానం.. రవిచంద్రన్ అశ్విన్(55 వికెట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. సౌథీ 51 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసియా గడ్డపై సౌథీకి బౌలర్‌గా మంచి రికార్డు ఉంది. ఆసియా గడ్డపై సౌథీ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు.
చదవండి: IND vs NZ: డిఫెన్స్ ఆడాలనుకున్నాడు.. అవకాశమే ఇవ్వలేదు