
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా భోణీ కొట్టింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన అనంతరం రోహిత్ శర్మ(48), సూర్యకుమార్ యాదవ్ (63) టీమిండియా ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో ఉత్కంఠ రేపినా ఆఖరి ఓవర్ నాలుగో బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, సాంట్నర్, మిచెల్ తలా ఒక వికెట్ తీశారు.
రోహిత్ శర్మ(48) ఔట్.. టీమిండియా 141/2
రోహిత్ శర్మ(48) బౌల్ట్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సూర్యకుమార్ 61, పంత్ 10 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో టీమిండియా 104/1
12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 46, సూర్యకుమార్ యాదవ్ 37 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మార్క్ చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. రోహిత్ 37, సూర్యకుమార్ 5 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 165..3 ఓవర్లలో టీమిండియా 24/0
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ 7 పరుగులతో ఆడుతున్నారు.
20 ఓవర్లలో న్యూజిలాండ్ 164/6
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ ( 70 పరుగులు, 42 బంతులు; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్ చాప్‌మన్ 63 పరుగులు చేశాడు. మిగతా వారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీయగా..దీపక్ చహర్, సిరాజ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అశ్విన్ దెబ్బ.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రెండో బంతికి చాప్‌మన్(63) క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఐదో బంతికి గ్లెన్ ఫిలిప్స్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కివీస్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
దాటిగా ఆడుతున్న కివీస్.. 13 ఓవర్లలో 106/1
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ దాటిగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ తొలి హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనికి గప్టిల్ 42 పరుగులతో సహకరిస్తున్నాడు.
►10 ఓవర్లలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ 42, గప్టిల్ 19 పరుగులతో ఆడుతున్నారు.
6 ఓవర్లలో న్యూజిలాండ్ 41/1
ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ 30, మార్టిన్ గప్టిల్ 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డారిల్ మిచెల్ భువనేశ్వర్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు.
డారిల్ మిచెల్ గోల్డెన్ డక్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్
మ్యాచ్ ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ డారిల్ మిచెల్ భువనేశ్వర్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది.
జైపూర్: టి20 ప్రపంచకప్ 2021 ముగిసిందో లేదో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ ఆరంభమైంది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగుతున్న తొలి టి20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక సీనియర్ల గైర్హాజరీలో టీమిండియాలో చాలా మార్పులు జరగనున్నాయి. ఇక రోహిత్ టి20ల్లో పూర్తిస్తాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండడంతో అతనికి ఈ సిరీస్ కీలకంగా మారింది. అటు న్యూజిలాండ్‌లో కూడా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమిసన్‌లు దూరంగా ఉండడంతో సౌథీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 15 సార్లు టి20ల్లో తలపడగా.. ఆరు సార్లు టీమిండియా.. 9 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది.
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
Toss Update from Jaipur:@ImRo45 has won the toss & #TeamIndia have elected bowl against New Zealand in the first T20I. @Paytm #INDvNZ
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f pic.twitter.com/Xm3p91BgLG
— BCCI (@BCCI) November 17, 2021
Comments
Please login to add a commentAdd a comment